బాబూ-మోడీ పాలన లో మూతపడుతున్న హటళ్ళు.


బాబూ-మోడీ పాలన లో మూతపడుతున్న హటళ్ళు.


 చాయ్ వాళమోదీ దేశ ప్రధానిగా ఎన్నికయ్యార ని గోబెల్స్ ప్రచారం చేసుకున్న ఆర్ఎస్ఎస్ బిజెపి శక్తులు నేడు అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ పై చేస్తున్న దాడులను ఆపమన కపోవడం, తటస్థంగా ఉండటం వల్లే భారత దేశ ప్రజలంతా ,గ్యాస్ వినియోగదారులు కోట్ల సంఖ్యలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని రెస్టారెంట్లుసైతంమూసుకునే పరిస్థితులు దాపు రించాయని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం పుల్లారావు విమర్శిం చారు. గ్యాస్ సరఫరా చేస్తామని మోసాలకు పాల్పడే దళారులు పట్ల అప్రమత్తంగా ఉండా లని ప్రభుత్వాలు హెచ్చ రికలు చేసే స్థితికి పరి స్థితి దిగజారిందని పుల్లారావు అన్నారు. కమర్షియల్ బండలు 2,500 నుండి 3,000 వరకు బ్లాక్ లో అమ్మే స్థితికి వచ్చారని ప్రజ లు గత్యంతరం లేక కట్టెపుల్లలను ఆశ్ర యించే స్థితి బాబు -మోడీ పాలనలోఆంద్ర ప్రదేశ్లో ఎదురైందని విమర్శించారు. రాష్ట్ర రాజధాని అమరావతి విజయవాడ నగరంలో హోటల్లు మూసివేస్తు న్నట్లు బోర్డులు ప్రత్యక్ష మవుతున్నాయని, ఇప్పటికైనా చంద్ర బాబు- పవన్ కళ్యాణ్ యుద్ధం వల్ల మనకు ఏమీ నష్టం లేదనే వితండ వాదనమాని ప్రజలకు కనీస అవ సరమైన గ్యాస్, ఆయి ల్ సంక్షోభ నివారణకు చర్యలు తీసుకోవాల ని ,లేనియెడల నిత్యవ సర వస్తువుల ధరలు పెరిగి ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని పుల్లాలావు తెలిపారు. గ్యాస్ ప్లాంట్ల వద్ద భద్ర త పెంచమని ఆదేశించే స్థితికి ప్రభుత్వాలు వచ్చాయటే సిగ్గుపడాల న్నారు. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ సందేశం లో బెంగుళూరు, పూణే, చెన్నై నగరాల్లోఎల్పీజీ కొరతవల్ల ఎదురవు తున్న ఇబ్బందుల నేపథ్యంలో కుకింగ్ కౌంటర్లుమూసివేస్తున్నట్లు ప్రకటించిందనీ, కరోనాలోలాగాయుద్ధం వల్ల వర్క్ ఫ్రం హోం అనికంపెనీలుఆదేశాలిస్తున్నారన్నారు. ఎల్పీజి కి ప్రత్యామ్నాయంగా వంటల కోసం విద్యుత్ పరికరాలు బయో ఇంధ నాన్ని ఉపయోగించు కోవడంపై దృష్టి పెట్టాల ని సూచిస్తున్నారని పుల్లారావుతెలిపారు. గృహ వినియోగ సిలిం డర్లు సైతం 45 రోజుల బుకింగ్ గడువు పెట్ట టం సరైనది కాదని అన్నారు. ఉచిత సిలిండర్ ల ఎన్నికల వాగ్దానాలు నేడు వాగా డంబరాలుగా మిగిలి పోయాయనిపుల్లారావు విమర్శించారు. ఈ సంక్షోభం ఇలాగే కొన సాగితే ప్రజలు ఎన్డీఏ పాలకులను నిలదీ స్తారని హెచ్చరించారు.