రోడ్లు వేసి మా బాధలు తీర్చారు.... మమ్మల్ని ప్రమాదాల ముప్పు నుండి కాపాడారు..... అంటూ ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను ప్రశంసలతో ముంచెత్తిన ఉద్యోగ ఉపాధ్యాయులు.

రోడ్లు వేసి మా బాధలు తీర్చారు.... మమ్మల్ని ప్రమాదాల ముప్పు నుండి కాపాడారు. అంటూ ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను ప్రశంసలతో ముంచెత్తిన ఉద్యోగ ఉపాధ్యాయులు.


 ఏలూరుజిల్లా చింతలపూడి దశాబ్ద నరకాలంగా చింతలపూడి టి నరసాపురం రోడ్డుపై ప్రయాణించడానికి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవస్థలు పడ్డాము. 

ఎంతోమంది ప్రమాదాలకు గురయ్యారు మరింతమంది ఆసుపత్రి పాలయ్యారు.

మీరు ఎమ్మెల్యేగా గెలిచి ఏడాదిన్నర కాలంలోనే నూతన రోడ్డు నిర్మాణం చేపట్టి మాకు సేద తీర్చారు.... మీకు ఎంత చేసినా అది స్వల్పమే అంటూ 

 టీ నర్సాపురం రోడ్డు లో ప్రయాణించే పలువురు ఉద్యోగ ఉపాధ్యాయులు తమ బాధను వ్యక్తపరుస్తూ , కొత్త రోడ్డు వేయడం వలన నేడు తాము సుఖ ప్రయాణం చేస్తున్నామని, సకాలంలో విధులకు సకాలం లో హాజరు కాగలుగు తున్నామని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ కృతజ్ఞతగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్  ని స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో అభినందన సభ ఏర్పాటు చేసి దుశాలువతో సత్కరించి ఆనందాన్ని పంచుకున్నారు. 

ఎప్పటికీ బాగుపడవు అనుకునే రహదారులన్నిటిని నేడు అద్భుతంగా తీర్చిదిద్దిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ చరిత్రలో నిలిచిపోతారంటూ  ఉపాధ్యాయులు ప్రశంసించారు. 

మీ అందరి మనసుల్లో నిలిచేలా అభివృద్ధి చేస్తా

ప్రతి అవకాశాన్ని అందుపుచ్చుకొని మీ ఆకాంక్షలకు మించి అభివచేసి మీ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతానంటూ ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు

నిరంతరం చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తున్నానని యువత ఉపాధి కల్పన తో పాటు అన్ని రంగాల్లో రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నియోజవర్గంగా తీర్చిదిద్దడానికి నేను చేస్తున్న కృషికి మీ సహకారం ఎంతో అవసరం అంటూ ఆనందభరితం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రసంగించారు.