పోలవరం సమస్యలను పరిష్కరిస్తా మంత్రి నిమ్మల రామానాయుడు
ఏలూరుజిల్లా పోలవరం సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం రైతులకు, గ్రామస్థులకు హామీ ఇచ్చారు.మంగళవారం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన మంత్రిని స్థానిక ఏటిగట్టు సెంటర్ వద్ద మండల టీడీపీ అధ్యక్షులు మంగిన వెంకటరమణ ( కొండ ) ఆధ్వర్యంలో పోలవరం పట్టిసీమ, కొత్త పట్టిసీమ రైతులు కలిసి తమ సమస్యలు వివరిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు.కన్నాపురం అడ్డరోడ్డు వద్ద అసంపూర్ణంగా నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి సాగునీటిని అందించాలని, అసంపూర్ణంగా నిలిచిన 30 పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని మంత్రిని రైతులు, గ్రామస్థులు కోరారు. పోలవరం సమస్యల్ని మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాదం ప్రసాద్, జల్లేపల్లి వెంకటనరసింహారావు, ఆకుల రాజా, నునకాని రాంబాబు, పోతుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.


