ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం గ్రామ పెద్దలకు.. ప్రజా ప్రతినిధులకు మరియు రైతులకు నమస్కారం
నేడు అనగా (శుక్రవారం)13/03/2026 న సాయంత్రం 4గం కు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు 3వ విడత అన్నదాత సుఖీభవ మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధిలు విడుదల చేయడం జరుగుతుంది. మన జంగారెడ్డిగూడెం మండలంలో 8291రైతులకు గాను 49,74,6000 రూ (నాలుగు కోట్ల, తొంభై ఏడు లక్షల నలబై ఆరు వేల రూపాయలు)లబ్ది పొందనున్నారు. జంగారెడ్డిగూడెం మండల పరిధిలో ఉన్న ప్రతి గ్రామ రైతు సేవ కేంద్రం నందు రేపు (శుక్రవారం) సాయంత్రం 4 గంటల నుంచి 6 గం వరకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల అవగాహన కార్యక్రమం మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిధుల విడుదల కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్ రైతులకు చూపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నాయకులు, రైతు సోదరులు హాజరు కావాల్సిందిగా తెలియజేస్తున్నాము.
మన నియోజకవర్గ స్థాయి నిధుల విడుదల కార్యక్రమం , గౌ,శాసన సభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో లింగపాలెం మండలం లో నిర్వహించడం జరుగుతుంది.


