ఘనంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభించిన మంత్రి కొలుసు పార్థసారధి
సంక్రాంతి మెగా బహుమతులు,ప్రధమ , ద్వితీయ . తృతీయ బహుమతులు అందజేసిన మంత్రి
పాడి పంటల అభివృద్దే దేశాభివృద్ధి
నూజివీడు :నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో నియోజకవర్గ స్థాయిలో జరిగే సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభించిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి.తొలుత రిబ్బన్ కట్ చేసి వివిధ పోటీల్లో ఏర్పాటు చేసిన పశువులు గేదె దూడల, దున్నలను తిలకించి,టాస్ వేసి కబాడీ పోటీలు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ దేశ ప్రగతిలో పాడి పంటలు ప్రముఖ పాత్ర అన్నారు.
దేశ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి లో పాడి పరిశ్రమది ప్రముఖ స్తానం ఉందన్నారు. సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ అన్నారు. రైతు అరుగాళ్ళు కష్టపడి పండించిన పంట ఇంటికి వచ్చిన రోజు కుటుంభం మొత్తం భార్య పిల్లలతో సంతోషంగా చేసుకొనే ఏకైక పండుగ సంక్రాంతి అని అభివర్ణించారు. ఉద్యోగ ఉపాధి నిమిత్తం పిల్లలు సుదీర ప్రాంతాల్లో దేశ విదేశాల్లో ఉండే వారంతా తమ సొంత గ్రామాలకు వచ్చి కుటుంబంతో సంతోషంగా గడుపుకునే ఏకైక తెలుగు పండుగ సంక్రాంతి అన్నారు.
రైతుల ప్రగతికి ఆర్థికాభివృద్ధి కి కృష్ణ మిల్క్ డైరీ వారు సుమారు. రూ.2లక్షల రుణాలు అందిస్తున్నారని రైతుల అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.గతంలో పేడ,పెంట కృత్రిమ ఎరువుగా వేసేవారని తద్వారా పంట తక్కువ వచ్చిన రోగాలు బారీన పడే వారము కాదన్నారు. ప్రస్తుత కాలంలో ఎరువుల వాడకం అధికంగా ఉన్నందున ప్రజలకు రోగాలు కూడా అధికమయ్యాయన్నారు.ఎరువుల వాడకం సాధ్యమైన మేరకు తగ్గించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పశువుల సెల్టర్లు ఏర్పాటు చేసి పశువుల పెంపకంను ప్రోత్సహిస్తుందని రైతులు అంతా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.రైతులకు పశుపెంపకం,పాడి పంటలకు అనేక పధకాల ద్వారా ఆర్ధిక రుణాలు అందిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
నియోజకవర్గ ములోని ప్రజలంతా సంక్రాంతి సంబరాలు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుకోవాలని అన్నారు. అనంతరం వివిధ గేదలు,దూడల, పాల పోటీలో విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు. సంక్రాంతి పోటీలకు ప్రోత్సాహ బహుమతిగా మంత్రివర్యులు రూ.10 వేలు, ఏలూరు పార్లమెంటు సభ్యులు పి, మహేష్ కుమార్ రూ.10వేలు చొప్పున కమీటీ సభ్యులకు అందజేసారు.ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, నాలుగు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పశుసంవర్ధక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పోటీలు
జనవరి సంక్రాంతికి 9,10,11.వ తేదీలలో కనీ వినీ ఎరుగని బ్రహ్మాండమైన సంక్రాంతి సంబరాలు మీర్జాపురం గ్రామంలో ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వివిధ పోటీలు నిర్వహించి,పోటీలో పాల్గొన్న విజేతలకు మెగా నగదు బహుమతులు ప్రకటించారన్నారు ఈ పోటీలు
నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో 9,10,11వ తేదీల్లో ఉదయం:9 గంటల నుండి (వారధి) సంక్రాంతి సంబరాలు జరుగును. పోటీల్లో కబాడీ, ముగ్గులు, పాలు,పశువుల అందాల పోటీలు,తదితర విభాగాలు నిర్వహిస్తారన్నారు.
పోటీల్లో పాల్గొన్న విజేతలకు చివరి రోజున నగదు బహుమతులు మంత్రివర్యులు అందజేస్తారు.
కబాడీ పోటీ విజేతలకు
ప్రధమ బహుమతి రూ.30వేలు
ద్వితీయ బహుమతి రూ.20వేలు
తృతీయ బహుమతి రూ.10వేలు
ముగ్గులు, పాలు, పాడి పశువుల అందాల పోటీ విజేతలకు
ప్రధమ బహుమతి, రూ.25వేలు
ద్వితీయ బహుమతి రూ.15వేలు
తృతీయ బహుమతి రూ.10 వేలు
అందజేస్తారన్నారు.
మూడు రోజుల పాటు నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తారు.
10 దేదీన
పాడి పశువుల, పాల పోటీలు, ఆవు దూడ అందాల పోటీలు.
11వ,తేదీన మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు.మరియు పోటీల్లో పాల్గొన్న అందరికీ బహుమతి ప్రదానం చేయబడును. మరియు మూడురోజుల గంగిరెడ్డి విన్యాసాలు, గొబ్బమ్మలు,ఆటల పోటీలు రక రకాల విన్యాసాలు జరుగును.ఈ పోటీల్లో పాల్గొన వలసిన వారు నమోదు చేసుకోవాలని వారిది కమిటీ కోరుచున్నాను.
కావున నూజివీడు నియోజకవర్గంలో ఆసక్తి గల వారందరూ కూడా కబడ్డీ పోటీలు మరియు పాల పోటీలు ,ఆవు దూడ అందాల పోటీలు,మరియు ముగ్గుల పోటీల్లో తమ తమ అభిరుచిని బట్టి
ఆశక్తి కలవారు కమిటీ వారిని కలిసి వారి వారి వివరాలను నమోదు చేసుకుని సంబరాల్లో పాల్గొని విజేతలుగా నిలవాలని ప్రైజులను మరియు ప్రైస్ మనీ లను అందుకోవాలని కోరుచున్నారు.



