రక్తదానం మహా యజ్ఞఫలం..



రక్తదానం మహా యజ్ఞఫలం..

రక్తదానంతో నిండు ప్రాణాలను కాపాడుద్దాం...

జిల్లా కలెక్టర్ లక్ష్మీశ

విజయవాడ :రక్తదానం మహా యజ్ఞఫలంతో సమానమని రక్తదానం చేయడం ద్వారా ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం అదృష్టంగా ప్రతి ఒక్కరూ భావించాల్సిన అవసరం ఉందని రక్తదానానికి మించిన మరొక దానం లేదని రక్తదానం చేసేలా యువతను ప్రోత్సహించాలల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.

స్వాంతంత్ర సమరయోదుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మరియు నలంద విద్యా సంస్థల సంయుక్త అధ్వర్యంలో నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు గల సలంద డీగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాస శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం ఒక మహా యజ్ఞఫలం లాంటిదన్నారు. రక్తదానం అనేక మంది రోగులకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తుందని అన్నారు.

 రక్తదానం చేసిన వారిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నారు. రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలను కాపాడడంలో కలిగిన అనందం మరోకటి ఉండదన్నారు. రక్తదానం చేయడం మానవత్వానికి మరో రూపంగా భావించాలన్నారు. ప్రాణాపాయి స్థితిలో ఉన్నప్పుడు సకాలంలో రక్తం లభించకపోవడం వలన ఎంతో మంది ప్రాణాలను కోల్పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. అనేక మంది రక్త హీనతతో భాదపడుతున్నారని తలసీమియా వ్యాధికి గురైన వారి ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం రక్త మార్పిండి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రక్తదానం అనేది ప్రాణదానం లాంటిద అన్నారు.

 ప్రమాదానికి గురి అయినప్పుడు, అత్యవసర శస్త్ర చికిత్సల సమయంలో రక్త అవసరం వుంటుందన్నారు. రక్తాన్ని దానం మాత్రమే చేయవచ్చునని ఉత్పత్తి చేయలేమన్నారు. రక్త అపసరమయ్యే జీవితాలకు రక్తదాతలే ప్రాణదాతలన్నారు. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు వరకు రక్తదానం చేయవచ్చునని, జీవిత కాలంలో ఒక వ్యక్తి దాదాపు 168 సార్లు రక్తాన్ని దానం చేయవచ్చునన్నారు. రక్తదానంతో నీరసించి పోతామనే అపోహను తొలగించి రక్తదానం చేసిన ప్రతీ సారి ఆరోగ్యవంతమైన కొత్త రక్తాన్ని పొందగలుగుతామనే విషయాన్ని యువతకు తెలియ చెప్పి రక్తదాసం వైపు మొగ్గు చూపేలా కృషి చేయాలన్నారు.

రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జి. సమరం మాట్లాడుతూ అత్యవసర సమయంలో అవసరమైన రక్తం లభించక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఇలా ఎన్టీఆర్ జిల్లాలో జరగకుండా ఉండటానికి రెడ్ క్రాస్ తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అన్ని రకాల బ్లడ్ నమూనాలు సేకరించి అందుబాటులో ఉంచుతామని, అత్యవసర సమయంలో రెడ్ క్రాస్ ద్వారా రక్తాన్ని అందుబాటులో ఉంచి మనిషి విలువైన ప్రాణాన్ని కాపాడటానికి తమవంతు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. దీనికి జిల్లా కలెక్టర్ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సోసైటీ వైస్ చైర్మన్ డా. వెలగా జోష్, సెక్రటరి సిహెచ్ చిట్టిబాబు, నలంద కళాశాల కర్స్పాండెంట్ ఏ. విజయబాబు, ప్రిన్సిపాల్ అనురాధ, కళాశాల ఉపాధ్యాయులు, భోదనేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.