ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, ఆగిరిపల్లి మండల పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆగిరిపల్లి సెంటర్‌లోని పోగడ చెట్ల మండపం వద్ద పార్టీ జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
మండలం పార్టీ అధ్యక్షులు బెజవాడ రాంబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పల్లగాని నరసింహారావు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.


