ఏలూరుజిల్లావార్తలు.
కామవరపుకోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 44వ వ్యవస్థాపక దినోత్సవం.
కామవరపుకోట,(మంజీరగళం)ప్రతినిధి మార్చి 29.
ఏలూరుజిల్లా కామవరపుకోట మండల టిడిపి అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ ఆధ్వర్యంలో కొత్తూరు రహదారి బంగ్లా వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద టిడిపి 44వ వ్యవస్థాపక దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలిత పాతూరు నుండి భారీ ర్యాలీగా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు టిడిపి అభిమానులు చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం కేక్ కట్ చేసి టిడిపి శ్రేణులు పరస్పరం స్వీట్లు పంచుకొని ఆనందించారు. ఈ సందర్భంగా రేపు రెండవ తేదీతో పదవీ కాలం పూర్తవుతున్న తెలుగుదేశం మద్దతుతో వైసిపి హయాంలో గెలుపొందిన ఐదుగురు సర్పంచులను ఒక ఎంపీటీసీ, 1982 నుంచి పార్టీలో ఉన్న సీనియర్లను, దు స్సాలువాతో, పుష్పగుచ్చాలతో సత్కరించి మండల అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ మమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక ట్రెండ్ సెట్టర్ అని తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు అయింది అని భూమియాకాశాలు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ విరాజిల్లుతుందని, ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. మండల టిడిపి అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణ లకు ఆద్యుడని, ప్రజా సంక్షేమానికి అగ్ర తాంబూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన చూపిన సంక్షేమానికి అభివృద్ధిని జోడించి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. వారిరువురు చూపిన బాటలో ఎమ్మెల్యే రోషన్ కుమార్, ఎంపీ పుట్ట మహేష్ కుమార్ లు నియోజకవర్గం ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జుజ్జురి బాబ్జి, సర్పంచులు గోరింక దాసు గూడపాటి కేశవరావు, పసుమర్తి పార్థసారధి బాబు, వేముల నాగేశ్వరరావు, గూడపాటి మధు,కరిపోతు అనూష, ఎంపీటీసీ కంఠమనేని అంజి మూర్తి, సొసైటీ చైర్మన్లు తూతా బాలాజీ కుమార్, ఘంటా మాధవరావు, బొప్పన అంజయ్య,డోలా విజయ్, పొన్నుబోయిన సురేష్, కారె సాల్మన్ రాజు, మాన్యం దుర్గారావు గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


