3వ విడత అన్నదాత సుఖీభవ, 22వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల..

3వ విడత అన్నదాత సుఖీభవ, 22వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల..


 ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం,రైతుల సంక్షేమానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాల నిధులను శుక్రవారం విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. భారత ప్రధాన మంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడనున్నాయి.

ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ స్థాయి కార్యక్రమాన్ని ముసునూరు మండలంలోని చెక్కపల్లి గ్రామంలో నిర్వహించనున్నట్లు నూజివీడు ఇంచార్జి సహాయ సంచాలకులు ఏడిఏ  మరియు మండల వ్యవసాయ అధికారి జె. భవాని తెలిపారు.

నూజివీడు నియోజకవర్గంలో మొత్తం 35,529 మంది రైతులకు 3వ విడత అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14.21 కోట్లు, అలాగే 22వ విడత పీఎం కిసాన్ పథకం కింద రూ.5.56 కోట్లు విడుదల కానున్నాయి అని,

అలాగే ఆగిరిపల్లి మండలంలో 10,009 మంది రైతులకు 3వ విడత అన్నదాత సుఖీభవ కింద రూ.4 కోట్లు, 22వ విడత పీఎం కిసాన్ కింద రూ.1.52 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయబడనున్నట్లు మండల వ్యవసాయ అధికారి జె. భవాని తెలిపారు.