ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం పరిధిలో,పి4 కార్యక్రమంలో భాగంగా నూజివీడు సీడ్స్ అధినేత మండవ ప్రభాకర్ రావు (మండవ ఫౌండేషన్) సౌజన్యంతో గురువారం ఆగిరిపల్లి మండల కార్యాలయ ఆవరణలో ఆరుగురు లబ్ధిదారులకు ఆటోలు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన ఆటోలలో ఒక ఎలక్ట్రిక్ ఆటో, ఒక ట్రక్ ఆటో, నాలుగు సీఎన్‌జీ ఆటోలు పంపిణీ చేశారు.
ఈ ఆటోలను పి4 కోఆర్డినేటర్ బెల్లం సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ మండవ వెంకటేశ్వరావు, ఎంపీడీవో అబ్దుల్ సలాం లబ్ధిదారులకు తాళాలు అందజేశారు.
ఈ సందర్భంగా బెల్లం సుబ్బారావు మాట్లాడుతూ పి4 పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు వందమంది లబ్ధిదారులకు కుటుంబ అవసరాల మేరకు గేదెల పంపిణీ, బడ్డీ కొట్లు, పిండి మిల్లులు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. గురువారం మొత్తం తొమ్మిది మందికి ఆటోలు మంజూరు చేయగా, అందులో ఆరుగురికి పంపిణీ చేశామని, మిగిలిన మూడు ఆటోలను త్వరలో అందజేస్తామని చెప్పారు.
ఎంపీడీవో అబ్దుల్ సలాం మాట్లాడుతూ నూజివీడు సీడ్స్ సంస్థ (మండవ ఫౌండేషన్) అందించిన ఈ ఆటోలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని సూచించారు.
లబ్ధిదారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పి4 కార్యక్రమం ద్వారా తమలాంటి పేద కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆటోలు తమ కుటుంబాలకు స్థిరమైన ఆదాయం అందించేందుకు దోహదపడతాయని తెలిపారు. నూజివీడు సీడ్స్ అధినేత మండవ ప్రభాకర్ రావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి కొల్లు పార్థసారథిలకు కృతజ్ఞతలు తెలిపారు.


