చాట్రాయి సెంటర్లో రెండుగంటలకు పైగా రాస్తారొఖో.
పోలీసులు కేసునీరు గార్చు తున్నారని ఆరోపిస్తున్న విద్యార్ద బందులు,తండ్రి.
న్యాయం చేస్తాననిఎసై డి రామకృష్ణ హమీతో ఆందోళన విరమించిన వైనం.
ఏలూరు జిల్లాలోని మండల కేంద్రమైన చాట్రాయి గ్రామంలో అంబటి గోపాలకృష్ణ కుమారుడు అంబటి అనుదీఫ్ వర్షిత్ (19 సం:) ఇంటర్మీడి యట్ సెకండియర్ చదువు తున్న విద్యార్ధి బుధవారం చాట్రాయి తాసిల్దార్ కార్యాల యానికి కూత వేటులో ఉన్న భీఫ్ చెరువులో శవమైతెలాడు.ఈమృతి పై పలు అను మానా లను మృతుని తండ్రీ బందువులు వ్యక్తం చేస్తున్నా రు.విద్యార్ధి తండ్రి గోపాల్ మాట్లా డుతూ నా కుమారుడు పోలవరం గ్రామానికి యాదవ కులం దివ్య అను అమ్మాయి ఒకరిని ఒకరు ఇష్టపడి నట్లుతెలిసిందనీ,ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తు న్నాడనీ, తన కుమారు డిని బుధవారం పోల వరం గ్రామాని కి చెంది న దివ్య అనే అమ్మాయి తల్లిదండ్రులు నేను లేని సమయంలో వచ్చి నా భార్యతో నా కుమా రుని జాగ్రత్త చేసుకోమ ని వార్నింగ్ ఇచ్చి వెళ్లా రని, వాళ్లు వచ్చి వెళ్లిన రెండు గంటలకే నా కుమారుడు శవం అయ్యాడని బోరున విలపించాడు.నా కుమారుడిని చంపి చెరువులో పడవేశార ని,పాలుగారే నా కుమా రుడు చెంప పై కొట్టిన చేతిదెబ్బ ఎర్రగా కమిలి పోయి ఉన్నదని, పంచనామ నిర్వహిం చకుండానే పోలీసులు అడావిడిగా నాకొడుకు శావాన్ని పోస్టమార్డానికి తరలించారని ఆవేదన వ్యక్తి చేసాడు. చాపల చెర్వు వద్ద సీసీ కెమేరా ఉన్నదని, సంఘటన జరిగిన వెంటనే, దానిని పరిశీలించి స్వాదీనం చేసుకోవలసిన పోలీ సులు ఆ పనిచేయక పోవటం, ఉదయాన స్టేషన్ కు వెళ్ళి రిపోర్టు చేస్తే,దానిలో ఉదయం నుండి నాలుగు గంటల వరకు మాత్రమే రికార్డు ఉన్నదని, తరువాత ఏడు గంటల నుండి మేము ప్రజలు చెర్వు వద్దకు వెళ్ళటం కుమా రుడ్ని బయటకు తీయ డం అంతా రికార్డ్ అయిందని, మధ్యలో సుమారు రెండు గంట లు రికార్డు కాక పోవడ మేమిటని ప్రశ్నించారు. అలానే నేను నా కుమా రుడికి ఎప్పుడు ఫోన్ చేసినా క్లాసులో ఉండి కూడా బయటికి వచ్చి మాట్లాడతాడని,అలాంటిది నా కుమారుడు ఇంటి నుండి బయటికి వెళ్లిన గంటా, గంటన్నర సమయంలో ఫోన్ చేయగా ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ ఫోన్ చెరువు కట్టమీద దొరికింది. ఇక్కడ ఎవరూ కనిపించడం లేదని చెప్పడంతో పరుగు పరుగున అక్క డికి వెళ్లి చూడటం జరి గిందని, అప్పటి వరకు ఫోన్లో మాట్లాడిన వ్యక్తి మరొక ఇద్దరు అక్కడే ఉన్నారని, నా కుమారు డి మృతదేహన్ని చెరు వులో నుండి బయటకు తీసిపరిశీలిస్తున్నక్రమంలో చాట్రాయి పోలీసు లు వచ్చి సెల్ ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి ని మరొకరిని స్టేషన్కు తీసుకు వెళ్లారని తెలిపారు. ఆ తర్వాత పోలీసులు నా కుమా రుడి సెల్ఫోన్ చాట్రాయి పోలీస్ స్టేషన్ పక్క కాల్వ గట్టుపై ఒక తాపీ మేస్త్రి కి దొరికి నట్లు చెబుతున్నారని, అలా నే బుధవారంరాత్రి 7 గంటల సమయంలో అను మానస్పదంతో పోలీసులు తీసుకుని వెళ్లిన వ్యక్తులను ఎలా విడిచిపెడతారని విద్యార్థిఅనుదీప్,బంధువులుప్రశ్నింస్తున్నారు. విద్యార్థి స్నేహితు డు ఒకరు తాను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడాడని, తరువా త ఆ సెల్ఫోన్ పోలవ రం లోఉన్న నా కుమా రుడినిఇష్టపడిన,ప్రేమించిన దివ్య అనే అమ్మా యి వద్దకు తీసుకు వెళ్లడం ఆమె నా కుమారుడి ఫేస్బుక్ లో ఉన్న పోస్టులను ఆమె తో నా కుమారుడు మాట్లాడిన ఫోన్ కాల్స్ డిలీట్ చేయడం జరిగిం దని బలంగా చెప్తున్నా రు. ఇదంతా చూస్తుంటే నా కుమారుడుని కొట్టి చంపి చెరువులో పడవే సి ఆత్మ హత్యగా చిత్రీ కరిస్తున్నారని గోపాల్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.నా కుమారుడ్ని చంపిన వారు, మంత్రి పార్ధసారదీ ఒకే సామా జిక వర్గానికి చెందిన వారు కావటంతో దోషు లను తఫ్పించే ప్రయ త్నం జరుగుతున్నట్లు పలువురు మాట్లాడు కుంటున్నారు. తెలుగు దేశంపార్టీ ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి బస్వారెడ్డి మృతుని తరుపున చాట్రాయి ఎస్ఐ డి రామకృష్ణతో చర్చలు జరిపారు. చాట్రాయి ఎస్ఐ డి రామకృష్ణ రాస్తా రోఖో నిర్వహిస్తున్న ఆందోళ నకారుల వద్దకు వచ్చి రెండు రోజుల్లో మృతు డు అంబటి అనుదీప్ మృతికి కారణమైన సంఘటనపై సమగ్ర విచారణ చేసి దోషుల ను కఠినంగా శిక్షిస్తాన ని, ఇందులో ఎటువంటి సందేహం పడనవసరం లేదని మృతుని తండ్రికి బంధువులకు హామీ ఇవ్వడంతో మృతుడు విద్యార్థి అనుదీప్ కుటుంబ సభ్యులు బంధువులు న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని హెచ్చరించి ఎస్సై గారిపై నమ్మకంతో ఆందోళనవిరమించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రాజేష్, వెంకట్రావు, జనసేన నాయకులు రామారావు, విద్యార్థి అనుదీప్ బంధువులు పాల్గొన్నారు.


