తూర్పుగోదావరిజిల్లావార్తలు.

 తూర్పుగోదావరిజిల్లావార్తలు.


కొవ్వూరు టి డి పి పార్టీ కార్యాలయంలో పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

కొవ్వూరు,(మంజీరగళం)ప్రతినిధి మార్చి 29.

తూర్పుగోదావరిజిల్లా కొవ్వూరు తెలుగు దేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా ఈరోజు కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు ఈ సందర్భంగా కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి,  అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. జూమ్ మీటింగ్ ద్వారా పార్టీ కార్యాలయంతో అనుసంధానమై, ఎల్ఈడి స్క్రీన్ల సభను వీక్షించారు. పార్టీ బ‌లోపేతానికి కృషి చేసిన సీనియ‌ర్ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌ను ఈ సంద‌ర్భంగా స‌న్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి చట్టబద్ధమైన రాజధానిగా తీర్మానం కావడం చారిత్రాత్మకమని, ఆవిర్భావం నుంచి పార్టీలో ఉండి, తెలుగుదేశం పార్టీ మొద‌లైన నాటి నుంచి నేటి వ‌ర‌కు పేద‌, బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల కోసం చేసిన కృషి వెల‌క‌ట్టలేనిదని. టీడీపీ ఇలాగే దిగ్విజ‌యంగా కొన‌సాగాల‌ని భ‌విష్య‌త్తులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను దేశంలోనే మొద‌టి స్థానంలో నిల‌పాల‌ని కోరుకుంటున్నాన్నారు. 

ఈ కార్యక్రమంలో టూమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి  రామకృష్ణ, అనుపిండి చక్రం, మద్దిపట్ల శివరామకృష్ణ, ఆళ్ళ హరిబాబు, నాదేళ్ల శ్రీరామ్, సూరపని చిన్ని, సూర్యదేవర రంజిత్, దాయన రామకృష్ణ, నామన పరమేశ్, కళాధర్ చక్రవర్తి, అర్జిల్లి రామకృష్ణ, బేతిన నారాయణ, సిద్దా దుర్గా ప్రసాద్, వేమగిరి వెంకట్రావ్, చింతపల్లి సతీష్, కాకర్ల సత్యేంద్ర, మరియు మండల,-గ్రామ కమిటీ సభ్యులు, క్లస్టర్–బూత్ ఇంచార్జ్ లు, అనుబంధ కమిటీల సభ్యులు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.