సర్పంచులను ఘనంగా సన్మానించిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు


సర్పంచులను ఘనంగా సన్మానించిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు 

పోలవరం/ బుట్టాయిగూడెం : ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గ పరిధిలో గల బుట్టాయిగూడెం మండలంలో సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియడంతో, వారందరిని పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు ఘనంగా సన్మానించారు...

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..., గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు చేసిన సేవలు ఎంతో ప్రశంసనీయం అని కొనియాడారు...
 గత ఐదేళ్లలో పంచాయితీ స్థాయిలో అభివృద్ధి పనులను విజయవంతంగా అమలు చేసి, ప్రజలకు మౌలిక వసతులు అందించడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు...

అలాగే కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజల మధ్యలో ఉండి, భయపడకుండా సేవలు అందించడం వారి అంకితభావానికి నిదర్శనమని తెలిపారు... 
ప్రతి ఇంటికి చేరుకుని ప్రజల అవసరాలను తీర్చేందుకు చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు...

సర్పంచ్ పదవిలో ఉండగా గ్రామ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేసిన విధానం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు...
 గ్రామాభివృద్ధి అనేది ఒక్కరితో సాధ్యంకాదని, అందరి సహకారంతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంలో ఆయన స్పష్టం చేశారు...

భవిష్యత్తులో కూడా ప్రజల మధ్యలో ఉండి సేవలు కొనసాగించాలని, రాజకీయంగా మరియు సామాజికంగా మరింత ఎదగాలని సర్పంచులకు సూచించారు... 
వారి అనుభవం గ్రామాల పురోగతికి ఇంకా ఉపయోగపడాలని ఆకాంక్షించారు...

ఈ సన్మాన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.