వృద్ధులకు మహిళలకు వస్త్రాలు పంపిణీ
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్లను అజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగూర్ మేరా వృద్ధులకు వితంతువులకు మహిళలకు రంజాన్ మాసం సందర్భంగా చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు వృద్ధులకు వితంతువులకు రంజాన్ మాసంలో చీరలు పంపిణీ చేయడం జకాత్ డబ్బులు తీసి పేదలను ఆర్థికంగా సహాయం చేయడం ఆ పరలోక ప్రభువైన అల్లాహ్ హతుల్లా మెచ్చే విషయమని అన్నారు ఈ మాసంలో ఒక్క రూపాయి దానం చేస్తే 70 రూపాయలు దానం చేసినంత పుణ్యం వస్తుందని అన్నారు మన దగ్గర ఉన్న డబ్బు బంగారం ఉన్న వెండి ఉన్న అది ఎంత విలువ చేస్తుందో చూసి దానిమీద జకాత్ తీసి ముందు మన కుటుంబ సభ్యులను ఆ తర్వాత పేదవారిని ఆదుకోవాలని ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగూర్ మేరా కమిటీ ప్రతినిధులు అందరితో ప్రపంచంలోని నలుమూలలో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరీమణులకు పెద్దలకు విజ్ఞప్తి చేశారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన అజాద్ ముస్లిం కమిటీ నగర ఉపాధ్యక్షులు షేక్ బాషా షేక్ నజరీన్ కు అభినందనలు తెలియజేశారు ఇలాంటి మంచి కార్యక్రమం తమ కమిటీ ప్రతినిధులు అందరూ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి మౌలానా షేక్ సాహిత్ ఆలీ వైఎస్ఆర్ కాలనీ మహిళా అధ్యక్షురాలు నసీమా కమిటీ ప్రతినిధి గౌస్ తదితరులు పాల్గొన్నారు


