Subscribe Us

header ads

ఏజెన్సీ ప్రాంతం మాదిగలను వాల్మీకిలుగా గుర్తించాలి : ఇన్ఫోర్మ్ ప్రెసిడెంట్ గెడ్డం బాపిరాజు


 ఇంటిలెక్చువల్ ఫోరమ్ ఫర్ మాదిగాస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రంపచోడవరం  స్థానిక ఐటిడిఓ పిఓ ఆఫీస్ నందు  ఏజెన్సీ మాదిగల సామాజిక న్యాయ ధర్నా మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ముందుగా ఏజెన్సీ మాదిగలు ఏజెన్సీలోని వివిధ ప్రాంతాల నుండి చేరుకొని అక్కడ నుంచి పిఓ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు.అనంతరం రంపచోడవరం సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించి ఏజెన్సీలో మాదిగలు మానవ హారం నిర్వహించి ఏజెన్సీలో సమస్యలపై  ఇంటర్నేషనల్ అధ్యక్షులు గెడ్డం బాపి రాజు మాట్లాడుతూ.... మొన్న విజయవాడలో 125 అడుగుల డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ నాడు శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు గుర్తు చేస్తూ సామాజిక న్యాయం అంటే ఏ ఒక్కరికి న్యాయం జరగక పోయినా అది అంటరానితనమేనని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారని ఇంకా ఇక్కడ ఏజెన్సీలో మాదిగలు అంతకన్నా ఎక్కువ అంటరానితనంలోనే ఉన్నారని, ప్రాథమిక హక్కులు కూడా లేకుండా జీవిస్తున్నారని,ఏజెన్సీలోని మాదిగలను  వాల్మీకులుగా గుర్తిస్తేనే వారికి అసలైన సామాజిక న్యాయం జరిగినట్లని గెడ్డం బాపి రాజు అన్నారు.

అలాగే దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ముద్దా పిచ్చయ్య  మాట్లాడుతూ... పోలవరం డివిజన్లో ఎల్.ఎన్.డీ పేటలో రెండు ఎలక్షన్ లను బహిష్కరించారు అని మన సమస్యలను కూడా పరిష్కరించకపోతే అవసరమైతే   అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మాదిగలంతా ఎలక్షన్లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్ఫామ్ అధ్యక్షులు వేమగిరి ముసిలి బాబు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో మాదిగలు మొట్టమొదటిసారిగా 1932లో కొండ గిరిజనులుగా గుర్తింపు పొందారని, భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోని మాదిగలు వెనకబడిన తెగలుగా గుర్తింపు పొందారని,1939 లో జీవో నెo.1891 ప్రకారం ఆది ఆంధ్ర (మాల లేదా మాదిగ) కులాలను వాల్మీకులుగా గుర్తించాలని అలాగే స్వాతంత్ర్య అనంతరం ఏజెన్సీలోని మాదిగ, మాల,ఆది ఆంధ్ర,డోంబు, పనో, పైడి, కులాలను ఎలా ఆరు కులాలను కలిపి వాల్మీకులుగా గుర్తించారని అయితే ఏజెన్సీలోని అధికారులు మాదిగలను వాల్మీకులుగా గుర్తించడం లేదని వేమగిరి ముసిలిబాబు  ఆపోయారు.

ర్యాలీ అనంతరం సబ్ కలెక్టర్ ని  కలిసి నివేదిక అందజేశారు.అలాగే ఈ కార్యక్రమంలో ఇన్ఫామ్ ప్రోగ్రామ్ కమిటీ కన్వీనర్ పింగిలి విజయ్ కుమార్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నిడమర్తి చిన్నబాబు,దారా బాబు,నాగు,సవరపు సురేష్,అగ్నిపర్తి వెంకట్,కెంపు రత్నం, అయినవోలు మణి, గంజేటి నాగలక్ష్మి ,గౌరీ వివిధ ప్రాంతాల ఏజెన్సీ మాదిగలు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.