బుధవారం విజయవాడ లోని తన క్యాంప్ కార్యాలయం నందు గన్నవరం నియోజకర్గం లో వివిధ ఆరోగ్య కారణాలతో బాధపడుతూ వైద్యం చేయించుకుంటున్న మానికొండ గ్రామానికి చెందిన బెజవాడ కృష్ణారావుకు రూ.60,000 , విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామానికి చెందిన మాణిక్యం కు రూ.2,25,000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన LOC చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందచేశారు .
ఆపదలో ఉన్న ఎన్నో కుటుంబాలను సీఎం సహాయ నిధి ఆపద్భందువునిగా అదుకుంటుందని ఆయన తెలిపారు. మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు. బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.



