Subscribe Us

header ads

వైయస్ఆర్ సీపీ బీసీ నాయకురాలు అనూ యాదవ్ అక్రమ అరెస్టుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపాటు


 

పోలీసు స్టేషన్ వద్ద బైఠాయింపు

వైయస్ఆర్ సీపీ శ్రేణుల ఆందోళన..త్రీటౌన్ వద్ద ఉద్రిక్తత, అనూ యాదవ్ కు 41 నోటీసు ఇచ్చి పంపించిన పోలీసులు

బీసీ మహిళను రెండు గంటలు పోలీసు స్టేషన్ లో కూర్చోబెడతారా ?పోలీసులను నిలదీసిన మార్గాని భరత్ 

వారిపై కేసులు పెడతామని హెచ్చరిక

రాజమహేద్రవరం:
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫ్లెక్సీ పై పేడ రాశారనే అభియోగంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అను యాదవ్ పై కేసు నమోదు చేసి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకురావడంతో మాజీ ఎంపీ, వైయస్ఆర్ సీపీ నగర అధ్యక్షుడు,రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ స్టేషన్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

 శుక్రవారం ఆమె ఇంటికి వెళ్ళిన పోలీసులు అనూ యాదవ్ ను స్టేషన్ కు తీసుకు వచ్చి రెండుగంటలు కూర్చోబెట్టారు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న వైసీపీ శ్రేణులు భరత్ ఆధ్వర్యంలో ఆందోళన చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు దిగివచ్చి ఆమెకు 41 సీఆర్పీ నోటీసులు ఇచ్చి బయటకు పంపించారు. వైయస్ఆర్ సీపీ శ్రేణులు ఇంటికి వెళ్ళిపోతుండగా పోలీసు స్టేషన్ గేటు వద్ద అడ్డుకున్న సీఐ అప్పారావు..మళ్లీ స్టేషన్ లోకి రావాలని కోరడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపట్ల త్రీ టౌన్ ఎస్ఐ అప్పలరాజు దురుసుగా ప్రవర్తించడంతో మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. దీంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా రాజమండ్రిలో ఫ్లెక్సీలోని ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖంపై కోపంతో ఎవరైనా పేడ రాసి ఉండొచ్చు. అంత మాత్రంచేత బీసీ వర్గానికి చెందిన మహిళా నాయకురాలు అనూ యాదవ్ ను అరెస్టు చేసి ఎలా తీసుకు వస్తారని ప్రశ్నించారు. తుని, రాజమండ్రి ప్రభుత్వ వసతి గృహంలో జరిగిన సంఘటనలపై మహిళలు ప్రశ్నిస్తే ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కేసు పెట్టిస్తారా అని ఆయన నిలదీశారు. అసలు బాలికల వసతి గృహం వద్ద ఈవీఎం ఎమ్మెల్యే ఫ్లెక్సీ ఎందుకు, దానికి పర్మిషన్ ఉందా అని ఆయన ప్రశ్నించారు. 

మోరంపూడి ఫ్లై ఓవర్ వద్ద తన పేరుతో ఉన్న శిలాఫలకాన్ని ఆదిరెడ్డి వాసు అనుచరులు గునపాలతో బద్దలు కొట్టినప్పుడు తాను ఫిర్యాదు చేసినా ఎవరి మీద చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు మాత్రం పేడ రాశారని ఏకంగా పదిమంది పోలీసులు అనూ యాదవ్ ఉంటున్న అపార్ట్మెంట్ కు వెళ్ళి అరెస్టు చేయడమేమిటని భరత్ నిలదీశారు.ఇది ఆమె గౌరవానికి భంగం కలిగించడమేనని మండిపడ్డారు. ఎమ్మెల్యే మనిషి మద్యం సిండికేట్ కు సంబంధించి మాట్లాడిన ఆడియో బయటపెడితే ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులు మహిళను రెండు గంటలు స్టేషన్ లో కూర్చోబెట్టారని ఆయన విమర్శించారు. వారిపై కోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. అప్పటికీ ఇప్పటికీ పాలన ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారని మార్గాని భరత్ వ్యాఖ్యానించారు.

 అనూ యాదవ్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫ్లెక్సీపై పేడ రాసినట్లు సీసీ ఫుటేజీ ఉందని పోలీసులు చెబుతున్నారని, మరి నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆడియో ను తమ నాయకుడు మార్గాని భరత్ బయటపెడితే పోలీసులు చర్య తీసుకోలేదని విమర్శించారు. ఇలాంటి కేసులకు తాను భయపడేది లేదన్నారు. న్యాయవాది శంభూ ప్రసాద్ మాట్లాడుతూ 41ఏ నోటీసులు ఇచ్చి పంపాల్సిన ఈ కేసులో పోలీసులు అతిగా స్పందించి అనూ యాదవ్ ను అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకు వచ్చారని, దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని చెప్పారు.