180 ఫిర్యాదులకు పరిస్కార మార్గం ప్రజా దర్భార్లో పింఛన్లు సమస్యలు అధికంగా అర్జీలు రాగా మిగిలినవి రెవెన్యూ ఇంటి స్థలాల తదితర అర్జీలు
మంత్రి ఫిర్యాదుల పరిస్కారానికి అధికారులకు ఆదేశాలు
నూజివీడు /ఆగిరిపల్లి :రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆగిరపల్లి గ్రామంలో ఉదయం:10నుండి సాయంత్రం 6 గంటల వరకూ అర్జీలు స్పీకరించారు.నేడు ప్రజా దర్భార్ కు అధికంగా .పింఛన్లు అర్జీలు రాగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు. కొన్నింటిని తక్షణమే పరిష్కరించగా మరికొన్ని త్వరలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన అధికారులు.
ప్రతి శుక్రవారం రోజుల్లో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి మండలాల పర్యటనలో ఆయా ప్రాంతాల్లో స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను స్వీకరించి తక్షణ పరిస్కారానికి శ్రీకారం చుట్టారు.నేడు ప్రజా దర్భార్ కు అధికంగా ల్యాండ్, ఫించన్లు, ఇళ్ల స్థలాల, మరియు ఇతర సమస్యలు అధికారుల దృష్టికి రాగా సాదరంగా స్పీకరించి పరిస్కార మార్గాలు చేపట్టిన అధికారుల పట్ల అర్జీదారులు తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను తెలియజేసి తక్షణ పరిస్కారం పొందడానికి మంచి వేదిక అన్నారు. నియోజకవర్గము లో ల్యాండ్,పింఛన్లు, ఇంటి స్థలాలు, క్రైమ్,అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందడంలో జాప్యం, మరియు ఇతర సమస్యలను తెలియజేసి తక్షణ పరిస్కారం పొందగలరని మంత్రి తెలిపారు. కొన్ని కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కరించి మరికొన్ని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి నావంతు సహాయ సహకారాలు అందిస్తామని మంత్రివర్యులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులందరూ సహకరించాలని మంత్రి కోరారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయాలన్నారు.కూటమి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ సమన్వయంతో కలసి పనిచేసి ప్రజా సమస్యలు తీర్చాలని మంత్రి కోరారు. ఈ ప్రజాదర్భార్ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ తెలియజేయి వలసిన బాధ్యత కూటమి నాయకులందరి పై ఉందన్నారు. కూటమి నాయకులు బాధ్యతతో పని చేసి ప్రజలకు మేలు చేయాలని కోరారు. కొన్ని సమస్యలు సంబంధిత అధికారులతో చర్చించి శాశ్వతపరిస్కారానికి కృషి చేస్తానని మంత్రి అన్నారు. ప్రజాదర్బార్ వచ్చిన పిర్యాదులన్ని అత్యంత పారదర్శంగా బాధ్యతతో పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు.
కావున నియోజకవర్గంలోని ప్రజలందరూ తమ సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా మంత్రివర్యుల దృష్టికీ తీసుకువచ్చి శాశ్వతంగా పరిష్కరించుకోవాలని మనవి.ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు,ఆగిరపల్లి తహసీల్దార్ ప్రసాద్, ఆగిరపల్లి మండల అభివృద్ధి అధికారి భార్గవి,ఇతర అధికారులు పాల్గొన్నారు.



