మహిళల సంక్షేమంతోనే కుటుంబం, సమాజం దేశం సుభిక్షంగా ఉంటుంది.
ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్.

జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి గంగ భవాని ఫంక్షన్ హాల్ లో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళలను సాలు వాళ్లతో సత్కరించారు అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఏ పథకం ప్రారంభించిన మహిళలకే ప్రాధాన్యం ఇస్తున్నారని. మహిళలు సామాజిక, ఆర్థిక పురోగతి సాధించడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని.మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వన్ స్టాప్ సెంటర్, 181, 1098 హెల్ప్‌లైన్‌లు 24 గంటలు సేవలందిస్తున్నాయని తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు మంజూరు చేస్తుందని. స్త్రీ నిధి, ఉన్నతి పథకాల ద్వారా కూడా మహిళ లకు ఆర్థిక సహాయం అందుతోందని. రక్షణ చట్టంలో మహిళలకు రక్షణగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఈరోజు ప్రతి రంగంలో మహిళలు ముందంజలో ఉండడమే ఒక నిదర్శనం అని ప్రతి ఒక్క మహిళ ఒక శక్తిగా మారాలని ఏపీ ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం లో మహిళలు సంతోషపడుతున్నారని ఎక్కడికి వెళ్లాలన్న ఆధార్ కార్డుతో ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రయాణం చేయడానికి కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే రోషన్ అన్నారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల కూటమి నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు