ఏలూరుజిల్లావార్తలు.

 ఏలూరుజిల్లావార్తలు.


శాసన సభ్యుని ఉదాత్త స్వభావం - వైద్య చికిత్స కోసం బాధితుని కి క్షణాలలో ఎల్ ఓ సి జారీ.

జంగారెడ్డిగూడెం,(మంజీరగళం)ప్రతినిధి మార్చి 29.

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెంలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ బయలుదేరి సరిగ్గా కారు ఎక్కే సమయంలో తన తల్లికి గుండె ఆపరేషన్  నిమిత్తం సహాయం కావాలని జంగారెడ్డిగూడెం సత్యనారాయణ వచ్చారు

దాంతో చలించి పోయిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ తన ప్రయాణాన్ని ఆపుకొని అప్పటికప్పుడు బాధితుని వివరాలు సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎల్ఓసి ఇస్తానని చెప్పి తక్షణం ఎల్ ఓ సి సిద్ధం చేయాల్సిందిగా తన సిబ్బందిని ఆదేశించారు. లెటర్ సిద్ధం చేసే వరకు  ఎమ్మెల్యే  నిలువు కాళ్ల పై నిలబడి స్వయంగా ఎల్ ఓసి ఇచ్చి తన ఉదార స్వభావాన్ని కలిపి చాచారు