స్మార్ట్ ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ ఫర్ ధ డిజిటల్ వర్క్ ప్లేస్ సర్టిఫికెట్ కోర్స్ ఆవిష్కరణ.

స్మార్ట్ ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ ఫర్ ధ డిజిటల్ వర్క్ ప్లేస్  సర్టిఫికెట్ కోర్స్ ఆవిష్కరణ.


  ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం స్థానిక చత్రపతి శివాజీ త్రి శత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డా.ఎన్. ప్రసాద్ బాబు అధ్యక్షతనస్మార్ట్ ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ ఫర్ ధ డిజిటల్ వర్క్ ప్లేస్  సర్టిఫికెట్ కోర్స్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.ఎన్. ప్రసాద్ బాబు మాట్లాడుతూ డిజిటల్ టెక్నాలజీ అనేది కేవలం అధునాతన సాంకేతికత మాత్రమే కాదు, అది పని సామర్థ్యాన్ని పెంచే ఒక ముఖ్యమైన సాధనం. ఇది రోజువారీ పునరావృత పనులను  స్వయంచాలకం చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేస్తుందని మరియు మానవ తప్పిదాలను  తగ్గిస్తుందని అందువల్లనే నేడు అన్ని రంగాలలోనూ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ విభాగ అధిపతి జె. రాజా శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ కోర్స్ ద్వారా విద్యార్థులు ఎమ్ ఎస్ ఆఫీస్ డిజిటల్ ఫైల్స్ మేనేజ్మెంట్ క్లౌడ్ స్టోరేజ్ ఆన్లైన్ కమ్యూనికేషన్ టూల్స్ వంటి ఆధునిక కార్యాలయ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించే నైపుణ్యాలను అభివృద్ధి పరచుకుంటారని ఈ కోర్సు విద్యార్థులకు డిజిటల్ వర్క్ ప్లేస్ లో సమర్థవంతంగా పనిచేయటానికి కావలసిన ప్రాథమిక మరియు ప్రయోగిక జ్ఞానం అందిస్తుందని అందువలనే ఈ కోర్సును విద్యార్థుల ఉపయోగం కోసం సర్టిఫికెట్ కోర్సుగా మొదలుపెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ డా.ఎం మధు,డా సిహెచ్ బదరీ నారాయణ ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.