నారాయణ పాఠశాల నందు" సైబర్ భద్రతపై అవగాహన సదస్సు.
కృష్ణాజిల్లా, గన్నవరం
నేటి డిజిటల్ యుగములో విద్యార్థులు ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని నారాయణ పాఠశాలలో నిర్వహించిన సైబర్ అవగాహన సదస్సులో నిపుణులు పిలుపునిచ్చారు.
పాఠశాల యజమాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ విభాగం అధికారులు శ్రీ శ్రీధర్ గారు గన్నవరం ఎస్ఐ ప్రశాంతి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు మరియు ఫోటోలు పంచుకోకూడదని విద్యార్థులకు తెలియజేశారు.
బ్యాంకింగ్ వివరాలు మరియు పాస్వర్డ్ ఎవరికీ తెలియజేయకూడదని, బలమైన పాస్వర్డ్ ఏవిధంగా ఏర్పాటు చేసుకోవాలో విద్యార్థులకు తెలియజేశారు.
ఆన్లైన్లో ఎవరైనా వేధింపులకు గురి చేస్తే భయపడకుండా తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్ 1930 నంబర్ కి ఫిర్యాదు చేయమన్నారు.
ఆన్లైన్ గేమ్స్ ఆడే సమయంలో వచ్చే అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు.
సాంకేతికతను అంది పుచ్చుకోవడం ఎంత అవసరమో దానివల్ల కలిగే ప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఉండటం అంతకంటే ముఖ్యం అని సబ్ ఇన్స్పెక్టర్స్ శ్రీధర్ గారు, ప్రశాంతి గారు తెలియజేశారు. విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గారైన షేక్ మస్తాన్ భాషా గారు, ఏ.జీ. ఎం సత్తిరెడ్డి గారు, అకాడమిక్ డీన్ నవీన గారు మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు , ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.


