రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్
న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను లోకసభ ప్యానల్ స్పీకర్, బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తేనేటి కృష్ణ ప్రసాద్ ఇతర పార్లమెంట్ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
లోక్‌సభలో ప్యానల్ స్పీకర్‌గా సభను నడిపించే బాధ్యత తనకు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఈ అవకాశాన్ని ప్రజాసేవకు వినియోగించుకుంటానని పేర్కొన్నారు.
ఈ భేటీలో పలువురు పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొన్నారు.


