900 ఎకరాలు స్వచ్ఛందంగా ఇవ్వటానికి ముందుకు వచ్చిన పరిసర ప్రాంత రైతులు
మండలంలో బర్కెట్ నగరం, ఊట్ల గూడెం, రేగులగుంట , గ్రామాల ప్రజలు నేవీ ఆయుధ డిపో ఏర్పాటు చేయడానికి స్వచ్ఛందంగా తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, నేవీ డిపోను ఏర్పాటుచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రేగులగుంట, బర్కెట్ నగరం, ఊట్ల గూడెం గ్రామాల ప్రజలు కోరుతున్నారు. బుధవారం మండలంలో ఊట్ల గూడెం, బర్కెట్ నగరం గ్రామాలలో రైతులు నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఊట్ల గూడెం గ్రామానికి చెందిన రైతు కారం భీమరాజు మాట్లాడుతూ తమ గ్రామాల పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ భూమి 900 ఎకరాల వరకు ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసే నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు పంటలు పండకుండా, ఎటువంటి వసతులు లేని తమ గ్రామాలు, పొలాలు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగిందని, ఆయుధ డిపో ఏర్పాటు చేసి , నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మండల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మహిళా రైతు కారం వెంకాయమ్మ మాట్లాడుతూ నేవీ డిపో ఏర్పాటు చేస్తే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, ఎందుకు డిపో ఏర్పాటు చేయడానికి తమ పొలాలను స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు వచ్చామని తెలిపారు. రైతు మల్లి శెట్టి రాంబాబు మాట్లాడుతూ నేవీ ఆయుధ డిపో ఏర్పాటు


