వైభవంగా నిర్వహించిన సరమ్మ పేరంటాల ఉత్సవాలు
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న సరమ్మ పేరంటాల ఉత్సవాలు మంగళవారంతో ముగిసాయి. ఎంతో వైభవంగా జరిగిన ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసాయి. ధర్మాజీ గూడెం ఎస్సై వెంకన్న బాబు ఆధ్వర్యంలో ప్రతిరోజు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. చివరి రోజు అన్న సమారాధన జరిగింది. ఈ అన్న సమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. లింగపాలెం, సింగగూడంతో పాటు అనేక గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు వివిధ రంగాలలోని ప్రముఖులు అమ్మవారి ఆశిస్సులు తీసుకుని అన్న సమారాధనలో పాల్గొనడం జరిగిందనీ కమిటీ వారు తెలియజేశారు.



