‎కావూరి సాంబశివరావు మృతి తీరని లోటు.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

‎కావూరి సాంబశివరావు మృతి తీరని లోటు.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్.



 

 సీనియర్ రాజకీయ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు గారి మృతి పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీ లో ఉన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అక్కడినుంచే కావూరి మృతికి సంతాపం తెలుపుతూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కావూరి మృతి ఏలూరు జిల్లాతోపాటు రాష్ట్రానికే తీరనిలోటని, రెండుసార్లు ఏలూరు నుంచి, మూడు సార్లు మచిలీపట్నం నుంచి మొత్తంగా ఐదు సార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన కావూరి సాంబశివరావు రాష్ట్రానికి విశేష సేవలు అందించారన్నారు. మన్మోహన్ సింగ్ గారి కేబినెట్‌లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కావూరి జౌళి రంగంలో ఆధునీకరణకు ఆయన అనేక సంస్కరణలు చేపట్టారని కొనియాడారు. అంతేకాకుండా 'కావూరి ఛారిటబుల్ ట్రస్ట్' ద్వారా  విద్య, వైద్య రంగాల్లో ఆయన చేసిన సామాజిక సేవలు నేటికీ ఎంతో మందికి అండగా నిలుస్తున్నాయన్నారు. 

పారిశ్రామికవేత్తగా, సీనియర్ రాజకీయ నాయకునిగా ఎన్నో సేవలు అందించిన  కావూరి సాంబశివరావు మృతి దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కావూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.