Subscribe Us

header ads

దాతలు సేవలు అభినందనీయం

 

నూజివీడు :ఏలూరు జిల్లా, నూజివీడు

మండలం మర్రిబంధం గ్రామంలో సోమవారం వైయన్ఆర్ ఛారీటిస్ ద్వారా పది కుట్టుమిషన్లు, ఒక టిపిన్ తోపుడు బండిని, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిరుపేదలకు ఉపకరణాలను అందజేసారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మనకు ఉన్న దాంట్లో కొంత నిరుపేదలకు అందించిన సంతృప్తి దేనిలోనూ రాదని అన్నారు. వైయన్ఆర్ ఛారీటిస్ సేవలు ఎంతో స్ఫూర్తిదాయకం, దాతల సేవలు అభినందనీయం అని, నిరుపేదలకు ఉపకరణాలు అందించడం వలన వారు ఆర్థికంగా బలోపేతం అయ్యి గ్రామంలో గౌరవంగా జీవిస్తారని అన్నారు. ఆర్థికంగా స్థిరపడిన ప్రతి ఒక్కరూ తనకు జన్మనిచ్చిన గ్రామానికి, నిరుపేదలకు చేయూతను ఇచ్చినట్లయితే వారు ఆర్థికంగా బలోపేతం అవుతారని, రాష్ట్ర ప్రభుత్వం దాతలు సేవలను గుర్తుపెట్టు కుంటుందని కొలుసు పార్థసారథి అన్నారు.

ఈ కార్యక్రమంలో వైయన్ఆర్ ఛారిటీస్ యలమంచిలి జయప్రకాష్, వారి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.