అధ్యక్షుడి హోదాలొ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం లో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్.
సానిటేషన్ కార్మికుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే.
జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా:
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా జంగారెడ్డిగూడెం వంద పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దుదామని చింతలపూడి ఎమ్మెల్యే అన్నారు. బుధవారం జరిగిన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడి హోదాలో కమిటీ సభ్యులతో కలసి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. అభివృద్ధి కమిటీ సమావేశం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారన్నారు.
ఇక్కడి పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి అంటే రోగులకు ధైర్యం, నమ్మకం భరోసా కలిగేలా సేవలు అందేలా చూడాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించాలన్నారు. వైద్య పరీక్షల నిర్వహణపై ఆయన ఆరా తీశారు. పరిశుభ్రత,పారిశుధ్యం మెరుగణకు మరింత చర్యలు చేపట్టాలన్నారు అనంతరం సానిటేషన్ కార్మికులతో వారి సమస్యలను అడిగి తెల్సుకున్నారు.



