Subscribe Us

header ads

ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవతో శ్రీ సత్యసాయిబాబా మంచినీటి పధకం కార్మికుల వేతనాలు విడుదల


జీలుగుమిల్లి,ఏలూరు జిల్లా:

ఏలూరుజిల్లా జీలుగుమిల్లి.సంవత్సర కాలంగా బకాయిగా ఉన్న శ్రీ సత్య సాయి బాబా మంచినీటి పథకం కార్మికుల వేతనాలు పోలవరం శాసన సభ్యులు చిర్రి బాలరాజు చొరవతో విడుదలయ్యాయి. దాదాపు పదినెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు, ఎమ్మెల్యే కృషితో ప్రభుత్వం స్పందించి వేతనాలు వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ పరిణామంతో కార్మికులలో ఆనందం వెల్లివిరిసింది.

ఈ సందర్భంగా మంచినీటి పథకం కార్మికులు మంగళవారం పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే ని కలసి కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు మద్దతు ఇచ్చినందుకు ఎమ్మెల్యే ని ప్రశంసించారు. కార్మికుల సమస్యల పట్ల ఎప్పుడూ స్పందన చూపుతూ, వారి హక్కులు కాపాడటంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వం తీసుకున్న సానుకూల నిర్ణయం వల్ల కార్మిక కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగిందని ఆయన తెలిపారు.

అదేవిధంగా, పోలవరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తాగునీటి సదుపాయాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, గతంలో నిలిచిపోయిన పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.