Subscribe Us

header ads

గ్రామంలోని సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన గ్రామస్తులు


 
కృష్ణ జిల్లా,మొవ్వ:

కృష్ణాజిల్లా, మొవ్వ మండలం, చినముత్తేవి గ్రామానికి బుధవారం విచ్చేసిన కృష్ణాజిల్లా కలెక్టర్ డీ.కే బాలాజీ కు చినముత్తేవి గ్రామస్తులు పలు సమస్యలను పరిష్కరించాలని వినత పత్రం అందజేశారు.
గ్రామంలో గత ఆరు సంవత్సరాలు నుండి ఇండ్ల స్థలాలు లేక ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు నివసిస్తూ, అద్దె ఇంట్లో ఉంటూ, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, పేదలకు గత ప్రభుత్వ కాలములో ఇళ్లపట్టాలిచ్చి స్థలాలు చూపించలేదని, కావున ప్రస్తుత ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలకు మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలం ఇస్తానని ప్రభుత్వం ప్రకటించి 16 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇవ్వలేదని, కావున మా గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇల్లు నిర్మించాలని గ్రామస్తులు కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా విన్నవించుకోవడం జరిగిందని గ్రామస్తులు తెలియజేశారు. 

అలాగే చినముత్తేవి గ్రామంలో గత రెండు సంవత్సరాల నుంచి ప్రజానీకానికి ఇబ్బందులు గురి చేస్తున్న కోతులు బెడదను నివారించాలని,గ్రామంలో అయినంపూడి డ్రైనేజీ పై శిధిలమైన వంతెన నిర్మాణం వెంటనే చేపట్టి, ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని, గ్రామంలో అంతర్గత రోడ్లు నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలని, గ్రామస్తులు వినతి పత్రం అందజేయడం జరిగినది. స్పందించిన కలెక్టర్ త్వరలో మీరు ఇచ్చిన సమస్యలపై పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం గ్రామ శాఖ కార్యదర్శి మాదాసు నాగులు, సభ్యులు నాగమణి, వెంకటలక్ష్మి, గ్రామస్తులు శివ,శివ లీల, ఐశ్వర్య, రామలక్ష్మి, వేణు గోపాలకృష్ణ, శేషు కుమారి, నాగలక్ష్మి, శ్రీనివాసరావు, సుబ్రమణ్యం, స్వామి తదితరులు పాల్గొన్నారు.