Subscribe Us

header ads

ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన నూజివీడు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్


 
 ఆగిరిపల్లి ,ఏలూరు జిల్లా : 

 ఏలూరు జిల్లా: ఆగిరిపల్లి మండలం పరిధిలోగల తోటపల్లి హీల్ పేరడైజ్ పాఠశాలలో గత ఐదు రోజులుగా జరుగుతున్న మెగా డీఎస్సీ -2025 ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని నూజివీడు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఈరోజు సందర్శించి మాట్లాడుతూ నూతనంగా ఉపాధ్యాయులుగా అడుగుపెడుతున్న వారు అంకిత భావంతో, పనిచేసి ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని సూచనలు చేసి ఉన్నారు.

 ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ బయలాజికల్ సైన్స్ ఫోరం తరపున ఎన్టీఆర్ జిల్లా ఫోరం అధ్యక్షులు డాక్టర్ మామిడి శ్రీనివాస్ రావు గారి సహకారంతో సుధాకర్ గారి చేతుల మీదగా కొత్తగా బయలాజికల్ సైన్స్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు జ్యూట్ బ్యాగు, టెన్త్ క్లాస్ స్టడీ మెటీరియల్,ప్రశంస పత్రం,పెన్ను ఇవ్వటం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 1280 మంది సైకలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు ఈ విధంగానే అందరికీ ఇవ్వటం జరిగింది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రావి అరుణ, శ్రీమన్నారాయణ, ఎంఈఓ ఆనంద్ కుమార్ , రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.