ఏలూరు,కొయ్యలగూడెo :
ఏలూరుజిల్లా కొయ్యలగూడెం మండల కేంద్రంలోని ఏఎంసీ గ్రౌండ్ లో ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, నేరుగా ఆటో నడిపి ర్యాలీలో పాల్గొని అందరిని ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు సౌకర్యం కారణంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండటానికి ప్రతి ఏడాది 15 వేల రూపాయలు ప్రత్యేకంగా అందజేయడం గొప్ప సంక్షేమ కార్యక్రమం అని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు రాత్రింబవళ్లు శ్రమించి ప్రజలకు సేవలందిస్తున్నారని, వారి కుటుంబాలకు భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు అందించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రై కార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర నాయకురాలు నిర్మల కిషోర్, బిజెపి ఇంచార్జ్ కొండేపర్తి రామకృష్ణ, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా నాయకులు కరాటం ఉమా, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ, టిడిపి సీనియర్ నాయకులు శీలం వెంకటేశ్వరరావు, జయవరపు శ్రీరామ్మూర్తి, పారేపల్లి రామారావు, అలాగే కూటమి పార్టీల మండల, టౌన్ ప్రెసిడెంట్లు, సొసైటీ చైర్ పర్సన్స్, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు విశేషంగా పాల్గొన్నారు.



