హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు,వైసీపీ శ్రేణులు
తూర్పు గోదావరి,గోకవరం:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని పటిష్ట పరచడం కోసం పూర్వ వైభవం సంతరించుకునేలా పార్టీలో ప్రతిష్టాత్మకమైన మార్పులను తీసుకొస్తున్నారు. ఇటీవల ఆయన ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు మరియు అనుబంధ విభాగాల తో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ పటిష్టం కొరకు అనేక సూచనలు చేశారు. అందులో భాగంగా మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులతో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు.దానికి తగిన విధంగా ఆ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ ఒక ప్రకటనను కేంద్ర కార్యాలయం విడుదల చేసింది.ఇందులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటి బాబు కి స్థానం కల్పిస్తూ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా అవకాశం కల్పించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జగ్గంపేట నియోజకవర్గం లో జ్యోతుల చంటిబాబు నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేసుకుంటూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.చంటిబాబు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా పార్టీ శ్రేణులు వేల సంఖ్యలో హాజరవడం చంటిబాబు నాయకత్వ పటిమకు నిదర్శనం అని పార్టీ శ్రేణులు ఆనంద వ్యక్తం చేస్తున్నాయి.చంటిబాబు నాయకత్వ పటిమ కలవాడని, యువకుడు అని ఆర్థిక బలం, అంగ బలం కలవాడని,ఉన్నత విద్యావంతుడు అని ఉద్యమ స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేసే సత్తాగలవాడని ఈ నియామకం ద్వారా నియోజకవర్గంలో వైసిపి మరింత బలపడుతుందని రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.



