కృష్ణాజిల్లా,మొవ్వ:
కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం అవుతున్నారని పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నన్నపనేని వీరేంద్ర సమకూర్చిన సొంత నిధులు రూ.10 లక్షలతో జరుగుతున్న కృష్ణాజిల్లా మొవ్వ మండలం అయ్యంకి- పెడసనగల్లు ప్రధాన రహదారి అభివృద్ధి పనులను బుధవారం పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, దాత, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నన్నపనేని వీరేంద్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రిక పీ.4 కార్యరూపం దాలిస్తే ఎలా ఉంటుందో.. నేటి కార్యక్రమం ద్వారా చూస్తున్నామని అన్నారు. నిధుల కొరత కారణంగా అన్ని ప్రాంతాల్లో రోడ్లు వేయలేకపోతున్నాం. వీరేంద్ర లాంటి దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి ప్రజల సమస్యలు పరిష్కారానికి చొరవ చూపడం అభినందనీయమని, మంచి ప్రభుత్వ పాలనలో ప్రజలకు మంచి చేయడం కోసం దాతలు ముందడుగు వేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వర రావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మొదలగువారు పాల్గొన్నారు.



