Subscribe Us

header ads

ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్



ఏలూరు,జంగారెడ్డిగూడెం :

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో రెండు కోట్ల 15 లక్షల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్‌ సామాజిక భరోసా నెలవారి పింఛన్ల పథకంలో భాగంగా బుధవారం జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ ఏరియాతో పాటు డాంగే నగర్ లో చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ,పర్యటించి స్వయంగా లబ్దిదారులకు పింఛన్లు అందజేసి పెన్షనర్ల కుటుంబ యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
చింతలపూడి నియోజకవర్గంలో అతిపెద్ద పట్టణమైన జంగారెడ్డిగూడెంలో అక్టోబర్ ఒకటో తారీకు నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా, లేదా అంటూ అవ్వ తాతల దగ్గర ఆరా తీశారు. ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు అందిస్తున్నట్లు ఎమ్మెల్యేకు లబ్ధిదారులు వివరించారు.

ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్,
పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. ఉదయం 6.00 గంటల నుంచి నియోజకవర్గంలో సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ,నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు వంటి నిరుపేద, నిస్సహాయ వర్గాల కష్టాలను తొలగించడానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ఒక ముఖ్యమైన సంక్షేమ పథకంగా అమలు చేస్తోందని అన్నారు. దేశంలో సామాజిక భద్రతా పెన్షన్ కోసం అత్యధిక మొత్తాన్ని ఖర్చు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తెలియజేశారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం దసరా నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఆటో నగర్,గంగానమ్మ గుడి, విజయదుర్గ అమ్మవారి గుడి,ముత్యాలమ్మ గుడి, నూకాలమ్మ గుడి,వాసవీ కన్యకాపరమేశ్వరి గుడి పలు మండపాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో పట్టణ కూటమి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.