కోకో నాణ్యత పెంచేందుకు 12 కోట్లతో రైతులకు ఆధునిక పరికరాలు కోసం ప్రతిపాదనలు సమర్పించాం.
అవగాహన సదస్సులు నిర్వహించి రైతులు నుండి సలహాలు, సూచనలు తీసుకోవాలి.
దేశంలోనే ఏలూరు జిల్లా కోకో మొదటి స్థానంలో ఉన్నాం, అదే స్థాయి క్వాలిటీలో ఉండేలా చూడాలి.
జిల్లాలో 36,150 ఏకరాలు కోకో సాగు జరుగుతుంది, ఈ ఏడు అదనంగా మరో 3 వేలు ఏకరాలు పెంచాలి.
కొబ్బరి లోనే కాదు, ఆయిల్ పామ్, కోకో పంటలు సాగుతో రైతులు అధిక లాభాలు పొందాలి.
కోకో సాగు, మార్కెటింగులో రైతులకు అన్ని విధాల సహకారం అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది.
జిల్లాలో కోకో ప్రాసెసింగు యూనిట్లు స్థాపనకు రైతులు ముందుకు వస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తాము.
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి.
ఏలూరు :
ఏలూరుజిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో బుధవారం " కోకో సాగు మరియు పంటకోత తర్వాత నిర్వహణలో ఆధునిక పద్ధతులపై ఒక రోజు వర్క్‌షాప్ లో " జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ నాణ్యమైన కోకో మంచి ధర పలుకుతుందని, దేశంలోనే ఏలూరు జిల్లా కోకో సాగులో మొదటి స్థానంలో ఉందని, , అదే స్ఫూర్తితో నాణ్యమైన కోకో సాగు చేసేలా రైతులు దృష్టి పెట్టాలన్నారు.
జిల్లాలో 18 మండలాలు 13 వేల మంది రైతులు 36,150 ఏకరాలు కోకో సాగు జరుగుతుందని, ఈ ఏడు అదనంగా మరో 3 వేలు ఏకరాలు పెంచుటకు అధికారులు ప్రత్యేక దృష్టి, రైతులు ముందుకు రావాలన్నారు. జిల్లాలో ఎక్కువగా టి.నరసాపురం, పెదవేగి, జంగారెడ్డిగూడెం, చింతలపూడి కామవరపుకోట, ద్వారకాతిరుమల ఆరు మండలాల్లో కోకో పంట ఎక్కువగా సాగు చెయ్యడం శుభ పరిణామం, అదే స్థాయిలో మిగతా మండలాలు రైతులను ప్రోత్సహించాలని అన్నారు. కొబ్బరి లోనే కాదు, ఆయిల్ పామ్, కోకో పంటలు సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. కోకో సాగు, మార్కెటింగులో ఉన్న ఇబ్బందులను తొలగించి, రైతులకు అన్ని విధాలా సహకారం అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, రైతులు కోకో పంటలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రైతులు క్వాలిటీ కోకో పంటలు వేస్తే కొనుగోలుదారులే మన ఇంటికి వచ్చి మంచి ధరను ఇచ్చి కొనుక్కుంటారన్నారు. పండిన పంటలు పులియ పెట్టడం, ఎండబెట్టడం, కోకో నాణ్యత పెంచడానికి ఆధునిక పరికరాలు కోసం రూ 12 కోట్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని తెలిపారు.
రైతులకు ఇంకేమైనా కావాలన్నా, వీటిపై అవగాహన సదస్సు నిర్వహించి, రైతులు నుండి సలహాలు,సూచనలు తీసుకోవాలన్నారు.జిల్లా జిడిపిని పెంచేలా, కోకో ప్రాసెసింగు యూనిట్లు స్థాపనకు రైతులు ముందుకు వస్తే సకల సౌకర్యాలు కల్పిస్తాము: జిల్లా కలెక్టరు వ్యవసాయ, అనుబంధ రంగాలలో పాటు కోకో ప్రాసెసింగు యూనిట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఏలూరు జిల్లా జీడిపిని పెంచేందుకు రైతులు ముందుకు అడుగులు వెయ్యాలని, జిల్లాలో ఏన్ని కావాలంటే అన్ని ప్రాసెసింగు యూనిట్లు స్థాపనకు అని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పూర్తి స్థాయిలో ఋణాలు మంజూరు చేస్తామని, మనతో పాటు మరికొందరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించ వచ్చునని అన్నారు. ఔత్సాహికులు, ఆసక్తి కల రైతులు ముందుకు వచ్చి ధరఖాస్తులు ఇస్తే స్థాపనకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు.
కోకో రైతులు మాట్లాడుతూ ఇటువంటి వర్కు షాపులు, సెమినార్లు నిర్వహించడం మాకు చాలా ఉపయోగాలు ఉంటాయని క్రమం తప్పకుండా సమావేశాలు జరపాలని తెలిపారు. మాటలు చెప్పినట్లు, కాగితాలు మీద చూపించి నట్లుగా క్షేత్రస్థాయిలో మాకు మేలు చెయ్యగలిగితే కోకో పంటలు మీద మరింత ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. కోకో నాణ్యత గల విత్తనాలు, సాగు, మార్కెటింగు పలు సందేహాలను రైతులు అడగగా, అధికారులు, శాస్త్రవేత్తలు నివృత్తి చేయడంతో రైతులు సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపి యఫ్ పియస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు డా.జి.శేఖర్ బాబు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె. షాజా నాయక్, ఏపి యంఐపి పిడి డా.యస్. రామ్మోహన్, డిఆర్డిఏ పిడి ఆర్.విజయ రాజు, యల్ డియం డి.నీలాద్రి, ఏపి ఫుడ్ ప్రాసెసింగు సొసైటీ పియంయఫ్ యంఇ జోనల్ మేనేజరు కె.జె మారుతి, ఏలూరు జోనల్ మేనేజరు సాయి శ్రీనివాసు, డిఆర్ పిపి హిమవాణి, శాస్త్రవేత్తలు డా.పి.మాధవీలత, డా.కె. రామచంద్రుడు, మండల ఉద్యాన శాఖ అధికారులు, కోకోశాల ఫౌండరు చాక్ లేటు స్పెషలిస్టు నితిన్ కార్డియా, మోండలీజ్ కోకో కంపెనీ ప్రతినిధులు, కోకో రైతులు, జిల్లా ఉద్యాన శాఖ ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



