Subscribe Us

header ads

జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపాలిటీ నిధులతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్


జంగారెడ్డిగూడెం,ఏలూరు జిల్లా :

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ దగ్గర నుంచి శ్రీనివాసపురం జంక్షన్ వరకు బీటీ రోడ్డు పనులకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ బుధవారం శంకుస్థాపన చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీనారాయణ థియేటర్ దగ్గర నుంచి పూరపాలక సంఘం నిధులు నుంచి ఏరియా ఆసుపత్రి మీదుగా శ్రీనివాసపురం జంక్షన్ వరకు మున్సిపాలిటీ నిధుల నుంచి రూ. కోటి 40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. పది కాలాల పాటు దృఢంగా ఉండే విధంగా నాణ్యతా ప్రమాణాలతో రహదారి నిర్మించాలన్నారు. నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పలు రహదారుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేశామన్నారు,ఈ కార్యక్రమం లొ కూటమి నాయకులు, కార్యకర్తలు, జడ్పీటీసీ సభ్యులు, కమీషనర్, ఆడపడుచు లు పాల్గొన్నారు.