ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ని కలిసిన ఏం ఈ ఎఫ్ నాయకులు
అమరావతి :ఏపీ జెన్కో ఎం ఈ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె. సాల్మన్ ఆధ్వర్యంలో ఎం ఈ ఎఫ్ నాయకులు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆర్. విజయానంద్ ని నేడు విజయవాడలోని ఆయన ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చము ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
తర్వాత ఆయన చేతుల మీదుగా విద్యుత్ ఉద్యోగుల నూతన కాలమాన పట్టిక, డైరీని ఆవిష్కరింపజేశారు. అనంతరము మాదిగ ఉద్యోగుల సమస్యలపై సిఎస్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
మహా జననేత సామాజిక పరివర్తకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాలు పోరాడి ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నప్పటికీ ప్రస్తుతం వివిధ శాఖల్లో అడక్వసీ పేరుతో మాదిగ ఉద్యోగులకు ప్రమోషన్లలో జరుగుతున్న తీవ్ర అన్యాయాలను సిఎస్ దృష్టికి తీసుకుని వెళ్లడం చర్చించడం జరిగింది.
అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ ప్రమోషన్లలో ఎస్సీ వర్గీకరణను పగడ్బందీగా ఇంప్లిమెంటేషన్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో డి డబ్ల్యూ ఎం ఏ ఎంప్లాయిస్ గా 2008లో ఔట్సోర్సింగ్ ద్వారా అపాయింట్మెంట్ అయి 2018లో ఎఫ్ టి ఇ గా హెచ్ ఆర్ పాలసీలోకి మార్పు చేయబడిన ప్రస్తుతం పని చేస్తున్న 254 మంది కంప్యూటర్ ఆపరేటర్స్ మరియు అకౌంట్ అసిస్టెంట్స్ ఉద్యోగులకు వారు మొదట ఉద్యోగంలో చేరిన సీనియార్టీని యాడ్ చేసి జీతభత్యాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న సిఫారసు లేఖ ద్వారా కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎం ఈ ఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు పిచ్చికె బాబు మాదిగ, జిల్లా కోశాధికారి డి. సుందర్రావు , పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ సి ఓ & ఏ ఏ పి.వి. రమణ మరియు విజయవాడ నుంచి వీటిపిఎస్ ఎం ఈ ఎఫ్ ప్రధాన కార్యదర్శి పి. కిరణ్ బాబు, ఏ డి ఈ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.



