ప్రిజర్ బాక్స్ విరాళం ఇచ్చిన నరసాపురం దత్తుడి కుటుంబం
విస్సన్నపేట(మ), నరసాపురం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త,ఆర్యవైశ్య నాయకులు గంధం నాగ సుబ్రమణ్యం(దత్తుడు) ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.మృతుడికి కొడుకులు లేకపోవడంతో తమ నలుగురు కుమార్తెలు పాడెను మోసి తన తండ్రి పై భక్తిని చాటుకుంటే గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు.ఈరోజు మృతుడు సుబ్రహ్మణ్యంది సంతాప సభ నేపధ్యంలో మృతుడి నలుగురు కుమార్తెలు, అల్లుళ్లు మరో అడుగు ముందుకు వేశారు.
విస్సన్నపేట ఆర్యవైశ్య సంఘం వారికి మృతుడి జ్ఞాపకార్ధంగా ఫ్రీజర్ బాక్స్ ను విరాళంగా అందించారు.
అవసరమైన వాళ్ళు ఆర్యవైశ్య సంఘం వారిని సంప్రదించి ఫ్రీజర్ బాక్స్ ను ఉచితంగా తీసుకువెళ్లవలసిందిగా మృతుడి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు


