ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం స్థానిక రోటరీ మాజీ అసిస్టెంట్ గవర్నర్ తపస్స్ విద్యా సంస్థల అధినేత తెదేపా యువ నాయకుడు కె 9సేవా సంక్షేమసంఘం గౌరవాధ్య క్షుడు దాకారపు కృష్ణ అగ్ని ప్రమాదం లో సర్వం కోల్పోయిన సుబ్బలక్ష్మి అనే మహిళ కుటుంబానికి గురువారం తక్షణసహాయం గా రూ 10వేలు నగదు అందించి మానవత్వం ను చాటు కున్నారని పలువురు కొనియాడారు.కె 9 అధ్యక్ష కార్య దర్సులు తొమ్మి దేళ్ల శ్రీనివాస్, శీలం కృష్ణం రాజు ఈ మేరకు ఒక ప్రకటన లో వివరాలు తెలిపారు.ఇక్కడి బుట్టాయి గూడెం రోడ్డు
లో ఇద్దరు ఆడ పిల్లల తో నివసిస్తున్న ఒంటరి మహిళ రంగాలసుబ్బలక్ష్మి కి ఏ ఆధారం లేదని తెలిపారు. ఆమె నివసిస్తున్న తాటాకు ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మూలంగా కాలి పోగా కట్టు బట్టల తో రోడ్ మీద పడ్డారు. ఆమె కు గల ఇద్దరు ఆడపిల్లల్లో ఒకరు రాజమండ్రి లోను మరొక అమ్మాయి స్థానికంగా చదువు కుంటున్నట్టు తెలిపారు. దాతలు సహకారం తో ఆమె పిల్లలను చదివిస్తున్నట్టు వివరించారు. ఆమె కూలి పనికి వెళుతున్నా నని వివరించారు. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదం తమను మరింతగా కష్టాల పాలు చేసిందని ఆమె కె 9 ప్రతి నిధులు వద్ద వాపోయారు. ఈ సందర్బంగా తమ సంఘం ద్వారా కూడా బాధితురాలిని ఆడుకుంటుమని అధ్యక్ష కార్యదర్సులు తెలిపారు.
ఈ కార్యక్రమం లో కె 9ప్రతినిధులు బాదరాల నరేష్, కటారి వాసు, శీలం గోపి, శీలం సతీష్ తెదేపా నేత
బూరుగు పల్లి సూరి బాబు తదితరులు పాల్గొన్నారు.


