జీలుగుమిల్లిలో ఘనంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం :

 జీలుగుమిల్లిలో ఘనంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం :

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జీలుగుమిల్లి మండల కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దివంగత నేత, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

​ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షులు కుమ్మరి నాగేంద్ర (టోని), జడ్పిటిసి మల్లం వసంతరావు మాట్లాడుతూ పార్టీ స్థాపించి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా వైసిపి రాష్ట్ర సమాచార హక్కు చట్టం కార్యదర్శి తగరం రాంబాబు మాట్లాడుతూ ​వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడి సొంత పార్టీ అని, కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ అని కొనియాడారు.2011 మార్చి 12న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజాపక్షాన నిలబడి పార్టీని స్థాపించారని, నాటి ఉపఎన్నికల నుంచి 2019లో 151 స్థానాల అఖండ మెజారిటీ వరకు పార్టీ సాధించిన విజయం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు.​కులమతాలకు అతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్ కే దక్కుతుందని పేర్కొన్నారు.​2029 లక్ష్యంగా ముందుకు సాగుదాం అని అన్నారు 

మండల పార్టీ ప్రెసిడెంట్ సందా ప్రసాద్ మాట్లాడుతూ ​స్థానికంగా కూటమి నాయకులు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కోవాలని నేతలు పిలుపునిచ్చారు. చిత్తశుద్ధితో పనిచేసి 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని, మన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని,మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ని అఖండ మెజారిటీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని కోరారు.

​ఈ వేడుకల్లో జిల్లా కమిటీ సభ్యులు బోధ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు ఉప్పల రాంపండు, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు సున్నం సురేష్, సర్పంచ్‌లు సిర్రి జగదాంబ, సున్నం వరలక్ష్మి (రాసన్నగూడెం) జీలుగుమిల్లి మండల ఆర్టిఐ అధ్యక్షులు గుమ్మల దుర్గారావు పార్టీ నాయకులు సాయి, భాస్కర్, మహేష్, ఆకుల రవి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.