ఏలూరుజిల్లా చింతలపూడి పట్టణంలోలో ఓల్టేజ్ సమస్య అధిగమించడానికి మరో 33/11 విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రతిపాదించాల్సిందిగా చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ అధికారులను ఆదేశించారు
చింతలపూడి లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల అమలుపైశాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ సమీక్షించారు.
గురువారం స్థానిక CVAP కార్యాలయంలో మున్సిపల్, రెవిన్యూ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులను సమన్వయంతో సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
చింతలపూడి పట్టణములో "అన్నా క్యాంటీన్ "ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆదేశించారు
గతంలో కొన్ని దశాబ్దాల పాటు వినియోగంలో ఉన్న వెలమపేట నుండి కాంతంపాలెం వెళ్లే రహదారి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రెవిన్యూ మున్సిపల్ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.


