కోడిపందాలు పేకాట జుద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఎస్సై చంద్రశేఖర్

కోడిపందాలు పేకాట  జుద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఎస్సై చంద్రశేఖర్ 


 మండలంలో ఎక్కడైనా  కోడి పందాలు, పేకాట, వంటి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై వి. చంద్రశేఖర్ తెలిపారు. మండలంలో గవరవరం గ్రామ శివారులో శుక్రవారం కోడి పందాలు నిర్వహిస్తున్న వారిని తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు. 15 ద్విచక్ర వాహనాలు, ఏడుగురు వ్యక్తులు, 2200 నగదు స్వాధీనపరచుకుని పోలీస్ స్టేషన్ కు  తీసుకురావడం జరిగిందని, కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు ఎస్సై తెలిపారు.