పి4 టీంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష సమావేశం

పి4 టీంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష సమావేశం


 పోలవరం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల అమలును మరింత సమర్థవంతంగా చేపట్టే దిశగా బుధవారం పి4 టీంతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. 

నియోజకవర్గంలోని ప్రభుత్వ పథకాలు ప్రజలకు పారదర్శకంగా, వేగంగా చేరే విధంగా అధికారులు మరియు టీం సభ్యులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.

ఈ సమీక్షలో ముఖ్యంగా పీజీఆర్‌ఎస్ (PGRS) ద్వారా వచ్చే ప్రజల ఫిర్యాదుల పరిష్కారం, పి4 కార్యక్రమాల అమలు తీరు, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI), పి4 వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించనున్న తొలి సభ ఏర్పాట్లు, అలాగే రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గ ర్యాంకింగ్ మెరుగుపర్చడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రతి కార్యక్రమం సమయానికి పూర్తి కావాలని, ప్రజలకు ఉపయోగపడే విధంగా అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరగాలని, అందుకు పి4 టీం సభ్యులు చురుకుగా పనిచేయాలని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు.

అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, జరుగుతున్న పనులు మరియు ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో రూపొందించిన “స్వర్ణ పోలవరం” బులిటెన్‌ను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యంగ్ ప్రొఫెషనల్ జె. జగదీశ్వరరావు, విజన్ టీం సభ్యులు జి. దుర్గాప్రసాద్, సాయి రాజేంద్ర, శరత్ సాయి తదితరులు పాల్గొన్నారు.