జనసేన పార్టీ కార్యకర్త పైదా గోపాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.


 జనసేన పార్టీ కార్యకర్త పైదా గోపాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. 


 జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త పైదా గోపాలకృష్ణ అకాల మరణం చెందడం పట్ల పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా

గోపాలకృష్ణ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారి దుఃఖాన్ని పంచుకున్నారు. కుటుంబానికి ఏ అవసరం వచ్చినా తాను మరియు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. గోపాలకృష్ణ పార్టీకి నిబద్ధతతో పనిచేసిన మంచి కార్యకర్త అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి సొసైటీ అధ్యక్షులు సరిపల్లి సత్యనారాయణ రాజు,స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు అభిమానులు పాల్గొన్నారు.