బాపట్ల జిల్లా – రేపల్లె గ్రీవెన్స్ డేలో 9 అర్జీలు స్వీకరణ

 బాపట్ల జిల్లా – రేపల్లెగ్రీవెన్స్ డేలో 9 అర్జీలు స్వీకరణ

రేపల్లె, మంజీర దళం ప్రతినిధి: 

ప్రజల సమస్యల పరిష్కారానికి రేపల్లె రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి (ఇంచార్జ్) పి. గ్లోరియా ఎంఏ అధ్యక్షత వహించారు. ప్రజలు తమ సమస్యలను వివరించగా మొత్తం 9 అర్జీలు స్వీకరించారు.
రేపల్లె మండలం మెళగుంట గ్రామానికి చెందిన పీత రవిచంద్రరావు తన భూమిని ఆన్లైన్‌లో నమోదు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు. అరవపల్లి గ్రామ నివాసి అల్లంశెట్టి శివ నాంచారయ్య కూడా తన భూమిని ఆన్లైన్ చేయాలని కోరారు. ఉప్పూడి రోడ్డులో పద్మజ టింబర్ డిపో సమీపంలో దొంక ఆక్రమణకు గురైందని, ఆ ఆక్రమణ తొలగించాలని అర్జీ సమర్పించారు.
కొల్లూరు మండలం గాజులంకకు చెందిన సెనగ ప్రభాకర్‌రావు తనకు ఉన్న లంక భూమిని ఆన్లైన్ చేయాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన కొత్త రమేష్‌బాబు తన భూమిపై సుమోటో కరెక్షన్ చేయాలని కోరారు.
వేమూరు మండలం జంపన గ్రామానికి చెందిన జాలాది బాబురావు సమస్య పరిష్కారం కోరుతూ అర్జీ సమర్పించగా, వేమూరు మండలం పెరవల్లి గ్రామానికి చెందిన జాలాది చిన్న వెంకట నరసింహారావు తన భూమిని ఆన్లైన్ చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు. అలాగే రేపల్లె మున్సిపాలిటీ పరిధిలోని బెల్లంకొండ రమేష్ చంద్ర, డి. రమేష్ కూడా తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు.
అధికారులు అందిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.