రివర్స్ బయ్యర్స్ మీట్స్ తో విస్తృత వాణిజ్య - AP MSME DC చైర్మన్ శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్


 
 రివర్స్ బయ్యర్స్ మీట్స్ తో విస్తృత వాణిజ్య
- AP MSME DC చైర్మన్ శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ 

 కాకినాడ :MSMEలకు అంతర్జాతీయ మార్కెట్ ను చేరువ చేసి విస్తృత వాణిజ్యం జరిగేలా కూటమి సర్కార్ రివర్స్ బయ్యర్స్ సెల్లర్స్ మీట్ ఏర్పాటు చేసిందని AP MSME DC చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ అన్నారు.గురువారం కాకినాడలో రివర్స్ బయ్యర్స్ సెల్లర్స్ మీట్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో తమ్మిరెడ్డి శివశంకర్ ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రపంచ బ్యాంక్, APMSME DC, FIEO సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి,విజయవాడ,విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో రివర్స్ బయ్యర్స్ సెల్లర్స్ మీట్స్ విజయవంతంగా జరిగాయన్నారు . 

ముఖ్యంగా ఏపీలో ఆగ్రో,ఆక్వా,హెర్బల్ పౌడర్ల ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉందన్నారు . కొనుగోలు దారులకు కావాల్సిన ఉత్పతులు నాణ్యమైనవిగా తయారు చేసి సకాలంలో అందజేసే విధంగా ఉత్పత్తిదారులు శ్రద్ధవహించాలని సూచించారు. ఉత్పత్తిదారులకు కొనుగోలుదారులకు మద్ద్య సహృద్భావ వాతావరణాన్ని నమ్మకాన్ని కల్గించే విధంగా MSME కార్పొరేషన్ అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందజేస్తుందని స్పష్టం చేశారు .

గతానికి భిన్నంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేలా ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు.
విదేశీ పారిశ్రామికవేత్తలు దేశంలో పెట్టె పెట్టుబడుల్లో 25శాతం మన రాష్ట్రంలోనే పెట్టుబడులు పెడుతున్నారన్నారు.  
 జెడ్ సర్టిఫికేషన్ ద్వారా కొనుగోలుదారులు నాణ్యమైన ఉత్పత్తులు సకాలంలో సరైన ప్యాకేజింగ్ తో డెలివరీ జరిగేలా భరోసా లభిస్తుందన్నారు . అలాగే కొనుగోలుదారుల నుండి రావాల్సిన చెల్లింపుల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా MSME ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి పర్య వేక్షిస్తుందన్నారు .డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు జరిగేలా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కాకినాడ సహాయ కలెక్టర్ మనిషా ని కోరారు. 

ఈ కార్యక్రమంలో FIEO దక్షిణ భారత సంయుక్త సంచాలకులు ఉన్నికృష్ణన్ , కాకినాడ జిల్లా సహాయ కలెక్టర్ మనీషా , కాకినాడ పరిశ్రమల శాఖ జిల్లా మేనేజ్ గణపతి , AP MSME DC ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ ,
డైరెక్టర్లు డాక్టర్ చిన్న రాజు , నల్లె ప్రసన్న ,నన్నపనేని మురళీమోహన్ , పోతుల వీరవెంకట సత్యన్నారాయణ మూర్తి ,ఎం.రాజారావు , విజయ రావు ,
అంబటి భూలక్ష్మి ,జగన్నాధరావు ,వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ కొనుగోలుదారులు , ఉత్పత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.