సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ.

 సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ.

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్ లో వేంచేసి ఉన్న సుందర బాలసుబ్రమణ్యేశ్వర ఆలయం వద్ద ప్రతీ మంగళవారం దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ జరుగుతోంది.ఈ వారం పట్టణానికి చెందిన ఏజన్సీస్ వ్యాపారస్తులు బచ్చు వేంకటేశ్వరరావు  పుష్పావతి దంపతుల ద్రవ్యసహకరణతో అన్నప్రసాద వితరణ జరిగినది. ఈ కార్యక్రమానికి విశేషమైన సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.అన్నప్రసాద వితరణ అనంతరం దాతలను దుశ్శాలువాలతో సత్కరించి ప్రసాదములు అందజేసారు. ఆలయకమిటీ మరియు ఉత్సవకమిటీ సంయుక్తంగా ఈ మహత్తరమైన కార్యక్రమం జరిగింది.