తల్లిదండ్రులు లేని ఒక విద్యార్థికి ఆశగా నిలిచిన మన ఎమ్మెల్యే మద్దిపాటి.

తల్లిదండ్రులు లేని ఒక విద్యార్థికి ఆశగా నిలిచిన మన ఎమ్మెల్యే మద్దిపాటి.


 ఏలూరుజిల్లా ద్వారకాతిరుమల శుక్రవారం ద్వారకాతిరుమల మండలం 

సి.హెచ్. పోతేపల్లి గ్రామానికి చెందిన బక్క తరుణ్ విష్ణు కుమార్ అనే నిరుపేద ఇంజనీరింగ్ విద్యార్థి జీవితం ఎంతో విషాదకరం. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి, ఎంతో కష్టపడి పెంచిన తల్లిని కూడా ఇటీవల కోల్పోయాడు. తల్లిదండ్రులు లేని ఆ బాలుడు చదువు కొనసాగించడం చాలా కష్టంగా మారింది.

ఈ విషయం తెలుసుకున్న గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు, అతని భవిష్యత్తు ఆగిపోకూడదని భావించి, తన సొంత నిధులతో కాలేజ్ ఫీజు చెల్లించి, చదువుకు ఎంతో అవసరమైన లాప్టాప్‌ను కూడా బహుకరించారు.

ఒక అనాథ విద్యార్థికి అండగా నిలిచి, అతని భవిష్యత్తుకు వెలుగునిచ్చిన ఈ సహాయం నిజంగా మనసును తాకే విషయం

ఇలాంటి మంచి మనసు ఉన్న నాయకుడు మన నియోజకవర్గానికి ఉండటం నిజంగా గర్వకారణం.

“పేదవాడి కన్నీరు తుడిచే చేయి… విద్యార్థి భవిష్యత్తును నిలబెట్టే నాయకుడు – మన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు