భవిష్యత్తులో ఆడపిల్లల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్‌ రాకుండా విద్యార్థులకు వ్యాక్సిన్

 భవిష్యత్తులో ఆడపిల్లల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్‌ రాకుండా విద్యార్థులకు వ్యాక్సిన్ 


బాపట్ల నియోజకవర్గ పరిధిలో రేపల్లె పట్టణంలోని ఇసుకపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో మంగళవారం  ఉదయం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఆరోగ్య కార్యక్రమాల భాగంగా ఈ వ్యాక్సిన్‌ను విద్యార్థినులకు అందించారు.

ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సముద్రాల రమేష్ మాట్లాడుతూ, హెచ్‌పీవీ వ్యాక్సిన్ ద్వారా భవిష్యత్తులో ఆడపిల్లల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించవచ్చని తెలిపారు. సాధారణంగా ఈ వ్యాక్సిన్ ధర రూ.5,000 నుండి రూ.10,000 వరకు ఉంటుందని, ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందిస్తున్నందున ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు అనిలా, హరీష్, రేష్మ, కిరణ్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అలాగే విశ్వశాంతి విద్యాసంస్థ హెచ్ఎం బి. నాగేశ్వరరావు, టిడిపి నాయకులు కొండవీటి అగత్య తదితరులు హాజరయ్యారు. స్కూల్ విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యాక్సిన్ తీసుకున్నారు.